Maharashtra : సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!

Maharashtra : సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!
X

చిత్ర విచిత్రమైన కారణాలతో వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. తాజాగా వధువు కుటుంబం వరుడి సిబిల్ స్కోర్ తెలుసుకుని పెళ్లిని రద్దు చేసుకుంది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో అమ్మాయి, అబ్బాయి ఓకే చెప్పడంతో పెద్దలు వివాహం కుదిర్చారు. అయితే, అమ్మాయి మేనమామ అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. అది చూసి అతను కాబోయే భార్యకు ఆర్థిక భద్రత కల్పించలేడని పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమ్మాయిలకు వివాహం చేయాలంటే తప్పకుండా అన్ని విషయాలు చెక్‌ చేయాలని అప్పుడే వారికి సరైన భవిష్యత్తును అందించగలమని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు.

సిబిల్ స్కోరును క్రెడిట్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ అందిస్తుంది. వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని ఈ సిబిల్ స్కోరు సూచిస్తుంది. ఈ స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు వేగంగా ఇస్తాయి. వ్యకులు గతంలో తీసుకున్న లోన్స్, క్రెడిట్ కార్డు వినియోగం .. తదితర విభాగాలను లెక్కించి సిబిల్ స్కోర్ అందిస్తుంది

Tags

Next Story