Charmi : చార్మి ఇంట్లో విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

పూరీ జగన్నాథ్ తో (Puri Jagannath) కలిసి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చార్మికి (Charmi) షాక్ తగిలింది. సరదా పోస్టులు పెట్టే చార్మి షాకింగ్ న్యూస్ స్టేటస్ ను షేర్ చేసింది. చార్మీ తన ఇంటి సభ్యుడ్ని కోల్పోయింది. తన అంకుల్‌ను కోల్పోవడంపై ఛార్మీ ఎమోషనల్ పోస్ట్ వేశారు.
ఈ పోస్ట్ కాస్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అంత స్ట్రాంగ్‌గా ఉండే వ్యక్తి ఇలా సడెన్‌గా చనిపోవడంతో ఒకింత ఆశ్చర్యకరంగానూ ఉందని, గుండె బద్దలైనట్టుగా అనిపిస్తోందంటూ ఛార్మీ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అంకుల్‌తో ఛార్మీకి ఉన్న బంధం తెలిపేలా ఓ ఫోటోను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇక ఆయన మీద తనకున్న ప్రేమను చాటేలా వేసిన పోస్ట్ కాస్త ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
'కక్కి అంకుల్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. అలాంటి వారు ఇలా సడెన్‌గా మరణించారని తెలిసి షాక్ అయ్యాను. నా గుండె బద్దలైనట్టుగా అనిపిస్తోంది. అసలు జీవితం అనేది ఊహకు అందదు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. పింకీ పిన్నీ, స్వీడెల్, నైసీ, కెన్నీ మీరంతా స్ట్రాంగ్‌గా ఉండండి. మీకోసం నేను ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ ఉంటాను..' అంటూ నటి ఛార్మీ భావోద్వేగంతో స్పందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com