WHO : లైంగిక వ్యాధులతో ఏటా 25లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ

WHO : లైంగిక వ్యాధులతో ఏటా 25లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ
X

లైంగికంగా సంక్రమించే వ్యాధులతో(HIV, వైరల్ హెపటైటిస్, STI) ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ముఖ్యంగా సిఫిలిస్(STI) వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో 2022లో కొత్త కేసులు పెరిగాయని వెల్లడించింది. నివారణ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. వీటిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

చికిత్సలు ఉన్నప్పటికీ హెపటైటిస్ బీ, సీ కొత్త కేసులు ఎక్కువగానే ఉన్నాయి. వైరల్ హెపటైటిస్ వల్ల మరణాలు కూడా పెరుగుతున్నాయి. 2019లో హెపటైటిస్ వల్ల 11 లక్షల మంది చనిపోగా.. 2022 నాటికి ఈ సంఖ్య 13 లక్షలకు పెరగింది. వీరిలో 11 లక్షల మంది హెపటైటిస్ బీ వల్లే చనిపోయారు. కాగా, హెచ్‌‌ఐవీ కేసులు, మరణాలు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది.

అయినప్పటికీ, 2022లో 6.30 లక్షల హెచ్ఐవీ మరణాలు సంభవించాయని పేర్కొంది. హెచ్‌‌ఐవీ బాధితులుగా మారుతున్న వారిలో 13 శాతం మంది 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే కావడం ఆందోళనకరమని తెలిపింది.

Tags

Next Story