Karachi : కరాచీలో 4 రోజుల్లో 450 మంది మృతి

Karachi : కరాచీలో 4 రోజుల్లో 450 మంది మృతి
X

పాకిస్థాన్‌లోని కరాచీలో ఎండలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వడదెబ్బతో 450 మంది మరణించినట్లు స్థానిక NGO అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరాచీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చనిపోయినవారిలో అనేకమంది నిరాశ్రయులు, డ్రగ్స్ బానిసలేనని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మరణాలతో మార్చురీల్లో మృతదేహాలు పేరుకుపోయాయని చెప్పారు.

పాకిస్తాన్‌లో అతిపెద్ద సంక్షేమ ఫౌండేషన్ అయిన ఈధి ట్రస్ట్ పేదలకు, నిరాశ్రయులైన, అనాధ వీధి పిల్లలకు, మహిళలకు సహాయం అందిస్తుంది. దీని కింద నగరంలో నాలుగు మార్చురీలు పనిచేస్తుండగా, మృతదేహాలను ప్రస్తుతం వాటిలో ఉంచేందుకు స్థలం లేదని ఫౌండేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఫైసల్ ఈధి తెలిపారు.

మంగళవారం నాడు 135 మృతదేహాలను , సోమవారం 128 మృతదేహాలను తమ మార్చురీలకు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. కరాచీ నగరంలో ఆఫ్ఘనిస్తాన్, కొన్ని ఆఫ్రికన్ దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులు ఉన్నారు. వీరిలో నిరాశ్రయులుగా ఉన్న చాలా మంది మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారు.

Tags

Next Story