US : ఇరాన్ పై దాడులకు అమెరికా రెడీ.. జరగబోయేది ఇదే

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్‌పై దాడికి అమెరికా కూడా సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కన్పిస్తున్నాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టతనివ్వనప్పటికీ.. దాడికి సంబంధించి ఆయన ప్రైవేటుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడులు చేసేందుకు ట్రంప్ ప్రైవేటుగా అంగీకరించినప్పటికీ.. తుది ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదని ఆయన తన సలహాదారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ అణు కార్యక్రమం వదులుకుంటుందేమోనని వేచి చూస్తున్నట్లు సమాచారం. అయితే, టెహ్రాన్ ఇప్పటికే హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఆలస్యమైందన్నారు. వచ్చేవారం చాలా కీలక పరిణామం చోటుచేసుకోవచ్చని, అంతలోపే ఏదైనా జరిగే అవకాశం కూడా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com