Indian Clarity : అమెరికాకు అంత ఆందోళన అవసరం లేదు.. భారత్ క్లారిటీ

భారతదేశంలో ఎన్నికలపై ఐక్యరాజ్యసమితి సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ . దేశంలో ఎన్నికలు "స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా" జరగాలని ప్రపంచ సంస్థ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
భారతదేశంలో ప్రజల రాజకీయ, పౌర హక్కులు రక్షించబడతాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ఓటేస్తారని ఆశిస్తున్నట్టుగా ఉన్న యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రకటనపై ఆయన స్పందించారు. జైశంకర్.. లోక్‌సభ ఎన్నికలలో తన మంత్రివర్గ సహచరుడు, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ కోసం ప్రచారం కోసం త్రివేండ్రం వచ్చారు. అమెరికా ప్రకటనపై స్పందించారు. మన ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఐక్యరాజ్యసమితి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా భారత ప్రజలు చూస్తారు. కాబట్టి, దాని గురించి వాళ్లు చింతించాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఓ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం.. పరిణామాలతో ఇండియా పొలిటికల్ అశాంతి గురించి యూఎన్ సెక్రటరీ జనరల్ మౌత్ పీస్ స్టీఫెన్ డుజారిక్ వ్యాఖ్యలను కూడా తోసిపుచ్చారు జైశంకర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com