Bird Flu : అమెరికాలో మరో వ్యక్తికి బర్డ్ ఫ్లూ
అమెరికాలో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. మూడు నెలల క్రితం డెయిరీ ఫాంలో పనిచేసే వ్యక్తికి కార్మికుడికి తొలిసారి బర్డ్ ఫ్లూ సోకగా.. తాజాగా మిచిగాన్లో రెండో కేసు బయటపడింది. రెండో బర్డ్ ఫ్లూ కేసును అమెరికా డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (ఎండీహెచ్ఎస్) తెలిపింది.
మిచిగాన్లోని డెయిరీలో పనిచేస్తున్న ఓ రైతులో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఈ వ్యక్తిలో హెచ్ఎన్1 వైరస్ ను గుర్తించినట్లు సీడీసీ వెల్లడిం చింది. బాధిత రైతు నుంచి రెండు శాంపిల్స్.. ఒకటి ముక్కు నుంచి, మరోటి కన్ను నుంచి సేకరించి పరిశీలించగా బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడినట్లు సీడీసీ తెలిపింది.
ప్రస్తుతం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఎండీ హెచ్ఎస్ తెలిపింది.
గత మార్చి నెలలో టెక్సాస్లోని డెయిరీ ఫాంలో ఆవులకు దగ్గరంగా ఉండి పనిచేసే వ్యక్తిలో బర్డ్ ఫ్లూ బయటపడింది. ఆవుల నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాపించిన తొలి కేసు ఇదే. బర్డ్ ఫ్లూ నివేదించిన తొమ్మిది రాష్ట్రాల్లో మిచిగాన్, టెక్సాస్ ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com