Donald Trump : ట్రంప్ కాల్పుల్లో అగంతకులు వాడిన గన్స్ ఇవే.. ఇద్దరూ హతం
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పోటీదారు డొనాల్డ్ ట్రంప్ పై దాడి చేసిన షూటర్లిద్దరూ వెంటనే హతమైనట్లు సీక్రెట్ సర్వీస్ తెలిపింది. షూటర్ ఏఆర్-15 తరహా రైఫిల్ని ఉపయోగించాడు. ఘటనా స్థలం నుంచి ఈ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ట్రంప్ పై దాడిలో ఇద్దరు షూటర్లు పాల్గొన్నారు. ఒక షూటర్ ట్రంప్ వేదిక సమీపంలో గుంపులో ఉండగా, మరొక షూటర్ మృతదేహం భవనం సమీపంలో కనిపించింది.
సీక్రెట్ సర్వీస్ ఆ ఇద్దరినీ అక్కడికక్కడే చంపింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఘటనను అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్తో పాటు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. నాగరిక సమాజంలో ఇలాంటి చేష్టలకు తావు ఉండకూడదన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్... ఇలాంటిది మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైందనీ.. తన కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్లిందన్నారు. చాలా రక్తస్రావం జరిగిందనీ.. వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com