Iran : ఇరాన్ అధ్యక్షుడిని హత్య చేశారా? మొసాద్‌పై అనుమానాలు

Iran : ఇరాన్ అధ్యక్షుడిని హత్య చేశారా? మొసాద్‌పై అనుమానాలు

ఇరాన్ సరిహద్దు పర్వత ప్రాతంలో ఆదివారం హెలికాస్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం చేసీని హత్య చేసి ఉంటారని పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ బద్ధ శత్రువు ఇజ్రాయెల్ హస్తం ఇందులో ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు.

హత్యలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉండేందుకు అవకాశం లేకపోలేదని యూరోపియన్ పార్లమెంట్ మాజీ సభ్యుడు నిక్ గ్రిఫిన్ వ్యాఖ్యానించారు. గాజా/హిజ్బుల్లా/ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రికతల వెనుక కారణాలు మొసాద్ కు తెలుసునని ఆయన అన్నారు.

ఇటీవల ఇరాన్, అజర్ బైజాన్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు రైసీ, అజర్ బైజాన్ అధ్యక్షుడు కలసి ఖేజ్ ఖలాసీ హైడ్రో విద్యుత్ డ్యాంను తమ సరిహద్దుల్లో ప్రారంభించారని, ఇది తమ రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి, మైత్రీ బంధానికి చిహ్నంగా నిలుస్తుందని నేతలు చెప్పారు. ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే ఇజ్రాయెలీ ఆయుధాల పరిశ్రమకు నష్టం వస్తుందని.. యుద్ధం కొనసాగితేనే మంచిదని ఇజ్రాయెల్ భావించి ఉండొచ్చంటున్నారు. రైసీకి అంతర్గతంగా శత్రువులు ఉండే అవకాశం ఉందని, వారే ఈ హత్యకు కుట్ర పన్ని ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story