Student Visa Fee : ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు భారీగా పెంపు

Student Visa Fee : ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు భారీగా పెంపు
X

విద్యార్థి వీసా ఫీజును ఆస్ట్రేలియా 473 అమెరికన్ డాలర్ల నుంచి 1,068 డాలర్లకు పెంచింది. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఇతర దేశాల నుంచి వలసలను నియంత్రించేందుకు, అంతర్జాతీయ విద్యావిధానాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

గత ఏడాది కాలంలో 5,48,000 మంది ఇతర దేశాల నుంచి అక్కడికి వలస వెళ్లినట్లు ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ఇది ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం పడనుంది.

విదేశీ విద్యకోసం వెళ్లే విద్యార్థులు ప్రారంభంలో అమెరికా, కెనడా దేశాలకు వెళ్లేవారు. ఆ రెండు దేశాలు వీసా ఫీజులను దాదాపు 185 డాలర్లు, 110 డాలర్లు పెంచడంతో.. విద్యార్థులు ఈ రెండు దేశాలకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకున్నారు. దీంతో సుమారు 30 శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పట్టారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వీసా ఫీజులను భారీగా పెంచేసింది.

Tags

Next Story