US Birthright Cancellation : ఆటోమేటిక్ యూఎస్ బర్త్‌రైట్ రద్దు: భారతీయులకు బిగ్ షాకే!

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నదే చేశారు. అమెరికాలో జన్మత: లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ను సవరించి వందేళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని రద్దు చేశారు. ఇకపై చట్టబద్ధంగా యూఎస్ లో ఉంటున్న వారు జన్మనిచ్చే పిల్లలకే ఈ హక్కు లభిస్తుంది. అక్రమ వలసదారుల పిల్లలకు వర్తించదు. చాలామంది భారతీయులు విజిటింగ్‌కు వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనిచ్చే సంగతి తెలిసిందే.
ఆటోమేటిక్ బర్త్‌రైట్ రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రభావం భారతీయులపై విపరీతంగా ఉండనుంది. ఇకపై పిల్లలకు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం వర్తించాలంటే వారి పేరెంట్స్‌లో ఒకరు యూఎస్ పౌరులు/ గ్రీన్ కార్డు హోల్డర్ (PR)/ US మిలిటరీలో పనిచేస్తుండాలి. గతంలో మాదిరిగా టెంపరరీ వర్క్ వీసా (H1B), స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసాపై అక్కడ కన్న పిల్లలకు వర్తించదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. ప్రస్తుతం ఆ సంస్థకు యూఎస్ అతిపెద్ద డోనర్. తాజా ఆదేశాలతో ఆ సంస్థకు ఇక ఇబ్బందులు తప్పేలా లేవు. తొలి హయాంలో కరోనా వచ్చినప్పుడూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పారిస్ వాతావరణ మార్పు ఒడంబడిక నుంచీ తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఒప్పందం ఒకవైపే ఉందని, న్యాయంగా లేదని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com