Warns America : వెనిజులా వెళ్లకండి.. అమెరికా వార్నింగ్

ఉగ్రవాద బెదిరింపులు, అమెరికన్ వ్యతిరేక భావాలు, అశాంతి కారణంగా వెనిజులా దేశం వెళ్లొద్దని అమెరికన్లను ఆ దేశం హెచ్చరించింది. వెనిజులాను సందర్శించినప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురైతే అత్యవసర సేవలు అందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపింది.
వెనిజులాలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఇక్కడికి వెళ్లే టూరిస్టుల్లో అమెరికన్లే ఎక్కువ.
అందుకే.. ఈ పరిస్థితుల్లో వెనిజులా వెళ్తే బందీలుగా చేసుకునే ప్రమాదం ఉందని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకోవాలని అమెరికా తన పౌరులకు సిఫార్సు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com