Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 6నెలల జైలు శిక్ష

Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 6నెలల జైలు శిక్ష
X

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆమెను దోషిగా తేల్చిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఏడాది క్రితం దేశంలో తీవ్ర నిరసనల మధ్య ఆమె ప్రభుత్వం కూలిపోగా.. హసీనా భారత్ లో తలదాచుకుంటున్నారు. దేశం విడిచిన తర్వాత ఆమెకు శిక్ష పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

హసీనాను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ భారత్ ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. షేక్ హసీనా ప్రస్తుతం కేవలం కోర్టు ధిక్కరణ కేసులోనే కాకుండాఇంకా తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఏడాది క్రితం జరిగిన ఆందోళనల్లో నిరసనకారులపై షేక్ హసీనా ప్లాన్ ప్రకారం దాడులు చేయించారనే ఆరోపణలున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. 2024 జూలై 15 నుంచి ఆగస్టు 15 మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Tags

Next Story