Indian Student : అమెరికాలో భారతీయ స్టూడెంట్‌ను బలితీసుకున్న 'బ్లూ వేల్ గేమ్'

అమెరికాలో ఓ భారతీయ స్టూడెంట్ మరణం వెనుక రహస్యం బయట పడింది. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మార్చిలో ఓ గేమ్ ఆడుతూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఇది 'బ్లూ వేల్ ఛాలెంజ్' అనే భయంకరమైన ఆన్‌లైన్ గేమ్ అని తెలిసింది. అమెరికాలోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారింది.
సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ ఏజ్ 20 ఏళ్లు. బాధితుడు మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థి. మార్చి 8న అతడు శవమై కనిపించాడు. అడవిలో కారులో డెడ్ బాడీ ఉందని బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పారు. దీనిపై అధికారుల దర్యాప్తులో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.
"బ్లూ వేల్ ఛాలెంజ్" అనేది ఆన్‌లైన్ గేమ్. దీని ఉచ్చులో పడితే.. ప్రాణహానిని కొని తెచ్చుకున్నట్టే. పలు ఫేజ్ లు దాటుతూ గేమ్ ఆడినప్పుడు ప్రాణాలు పోవచ్చు. భారత్ కు సంబంధించి అమెరికాలో బ్లూ వేల్ కు బలైన మొదటికేసుగా ఈ సంఘటనను చెబుతున్నారు అధికారులు. వ్యక్తిగత నియంత్రను ఎప్పుడూ కోల్పోవద్దని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com