Extreme Heat : మక్కా, మదీనాలో తగ్గిన ప్రార్థన సమయం

Extreme Heat : మక్కా, మదీనాలో తగ్గిన ప్రార్థన సమయం
X

సౌదీ అరేబియాలోని ముస్లిం పవిత్ర స్థలాలు మక్కా, మదీనాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. జనానికి రక్షణ కల్పించడం.. సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడం అక్కడి ప్రభుత్వానికి ఓ సవాల్ లాంటింది. హజ్ నెల ఆరంభం కావడంతో మారిన వాతావరణ పరిస్థితుల్లో పలుకీలక నిర్ణయాలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం.

అత్యంత వేడిగా ఉండే నెలలో మక్కాలో హజ్ యాత్ర చేసే యాత్రికులకు పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. అందుకే ప్రార్ధనల సమయాన్ని తగ్గించారు. ప్రపంచం నలుమూలల నుండి అన్ని వయసుల వారు హజ్ చేయడానికి సౌదీ అరేబియా చేరుకుంటారు. మక్కా, మదీనాల్లో మధ్యాహ్నం 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వృద్ధులు వేడిని తట్టుకోలేరు. అందుకే.. ఈ జాగ్రత్తలు తీసుకునే యాత్రీకులు రావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

వేడి పెరగడం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయని.. సౌదీ ప్రభుత్వం గతంలో కంటే వైద్య సదుపాయాలను పెంచిందని కార్డియోలు తెలిపారు. అత్యంత వేడి వాతావరణం ఉంది కాబట్టి.. మసీదులలో శుక్రవారం ప్రార్థనల సమయాన్ని తగ్గించాలని మక్కా, మదీనా ఇమామ్ లను అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ప్రసంగాల సమయాన్ని కూడా తగ్గించుకోవాలని.. యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని కోరింది.

Tags

Next Story