Israel : హమాస్‌తో యుద్ధం.. తగ్గేదేలే అంటున్న ఇజ్రాయెల్

Israel : హమాస్‌తో యుద్ధం.. తగ్గేదేలే అంటున్న ఇజ్రాయెల్
X

గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా దీన్ని మూడేళ్లకు పెంచినట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ కు చెందిన ఓ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది.

తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్ సమావేశంలో ఓటింగ్ కు పెట్టనున్నారు. ఓ వైపు హమాస్, మరోవైపు లెబనాన్ కేంద్రంగా పని చేస్తున్న హెబొల్లాతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తున్నందునే ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ పూర్తి మద్దతు ఉంది. వారిని ఎదుర్కోవాలంటే సైనిక సంపత్తిని కచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇజ్రాయెల్ మిలటరీ కమాండర్లు తెగేసి చెప్పడంతోనే అక్కడి ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, గతంలో మిటలరీ సర్వీసు నుంచి మినహాయింపు ఇచ్చిన వేలాది మంది ఆల్ట్రా ఆర్థోడక్స్ సెమినరీ విద్యార్థులకు సైన్యంలో చేరాల్సిందిగా నోటీసులు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Tags

Next Story