Donald Trump : డొనాల్డ్ ట్రంప్ కొత్త వారసుడొచ్చాడు.. చిన్న కుమారుడి ఎంట్రీకి అంతా రెడీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయింది. 'రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్'కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా పంపనున్నట్లు పార్టీ ఛైర్మన్ ఇవన్ పవర్ వెల్లడించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే.
ఆయన ఎంపికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జులైలో పార్టీ కన్వెన్షన్ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనుండగా.. వారిలో బ్యారన్ ట్రంప్ ఒకరని ఇవన్ పవర్ తెలిపారు. బ్యారన్ ట్రంప్ ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. మార్చితో ఆయనకు 18 ఏళ్లు నిండనున్నాయి.
వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన ప్రస్తుతం 'హష్ మనీ కేసు'లో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ట్రంప్ ఇతర వారసులైన డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, చిన్న కుమార్తె టిఫనీ సైతం పార్టీ తరఫున ఫ్లోరిడా ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com