Baloch Liberation Army : పాక్ ను నమ్మొద్దు.. భారత్ కు బలూచ్ హితవు

Baloch Liberation Army : పాక్ ను నమ్మొద్దు.. భారత్ కు బలూచ్ హితవు
X

ఓ పక్క భారత్‌ పాక్‌ మధ్య చర్చలు జరుగుతున్న టైంలో బలూచీస్థాన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌కు పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్‌ను ఎప్పటికీ నమ్మవద్దని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మవద్దని సూచించింది.

పాక్‌ యుద్ధ వ్యూహం.. తాత్కాలిక ఉపాయం మాత్రమే అని పేర్కొంది. ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్‌కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ సూచించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన సైనిక చర్యను క్షుణ్ణంగా గమనిస్తున్న బీఎల్‌ఏ కాల్పుల విరమణ ఒప్పందంపై తీవ్రంగా స్పందించింది.

Tags

Next Story