Earthquake In Russia : రష్యాలో భూకంపం.. భారత్‌కు సునామీ ముప్పుపై కీలక ప్రకటన

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తుంది. భూకంపం ప్రభావంతో రష్యా, జపాన్ తీరప్రాంతాలను సునామీ తాకింది. అమెరికా, న్యూజిలాండ్, చిలీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలో భారత్ కు సునామీ ముప్పు ఉంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దీనిపై స్పందించింది.
భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇన్‌కాయిస్ తెలిపింది. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘కామ్చాట్కాలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత సునామీ తీరాన్ని తాకింది. దీన్ని వల్ల భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు’’ అని ట్వీట్ చేసింది.
రష్యాలోని కురిల్ దీవులు, జపాన్ లోని హక్కైడో దీవులను సునామీ తాకింది. అలలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈక్రమంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎక్స్‌లో తెలిపింది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com