Sanctions On China : చైనాపై ఆంక్షల ఎఫెక్ట్.. ఇండియాకు యాపిల్ ఎగుమతులు

చైనా నుంచి దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించడంతో యాపిల్ తన ఐఫోన్ల తయారీ, ఎగుమతులను భారత్ నుంచి మరింత పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటరోలా కూడా భారత్ నుంచి ఎగుమతులను భారీగా పెంచవచ్చు. ఎలక్ట్రానిక్ మాన్యూ ఫ్యాక్చ రింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్యాక్సాన్, డిక్సన్ టెక్నాలజీ నుంచి స్మార్ట్ ఫోన్ల తయారీ భారీగా పెంచుకోనున్నాయి. 2014లో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతుల్లో యాపిల్ ఫోన్ల వాటా 65 శాతంగా ఉంది. శాంసంగ్ ఫోన్ల ఎగుమతుల వాటా 20 శాతంగా ఉన్నాయి. మిగిలిన 15 శాతం ఫోన్లను ఇండియన్ సంస్థలు ఎగుమతి చేశాయి. భారత్ లో గత సంవత్సరం 17.5 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఉత్పత్తి జరిగింది. వచ్చే మూడు సంవత్సరాల్లో భారత్ నుంచి ఐఫోన్ల తయారీ, ఎగుమతులను పెంచాలని యాపిల్ కంపెనీ నిర్ణయిం చింది. ప్రధానంగా చైనా నుంచి ఎగుమతులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com