HUIA Bird : ఈ పక్షి ఈక రూ.23 లక్షలు

HUIA Bird : ఈ పక్షి ఈక రూ.23 లక్షలు

న్యూజిలాండ్‌లో అంతరించిపోయిన huia bird ఈక రికార్డు ధర పలికింది. 100 ఏళ్ల నాటి 9 గ్రాముల బరువున్న ఈకను వేలానికి పెట్టగా ఏకంగా రూ.23 లక్షలకు అమ్ముడుపోయింది. ఇది బంగారం కన్నా విలువైనది కావడంతోనే భారీ ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ హుయా పక్షులు 1907లో చివరి సారి కనిపించగా 1920 తర్వాత భూమిపై తమ ఉనికినే కోల్పోయాయని చెబుతున్నారు. తెలుపు, నలుపు రంగుల్లో ఈ ఈకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయట.

ఇదొక ప్రపంచ రికార్డు. పిట్ట ఈకకు ఈ స్థాయిలో ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లోని మవోరీ ప్రజలకు హయియా పక్షిని దైవంగా భావిస్తారు. వారి తెగ పెద్దలు తలపై ఈ పక్షి ఈకలను తలపై కిరీటంగా అలంకరించుకొనేవారు. ప్రజలు బహుమతులుగా ఇచి్చపుచ్చుకొనేవారు. ఈకల క్రయవిక్రయాలు కూడా జరిగేవి. హుయిమా పక్షలు దాదాపు అంతరించిపోయాయి. చివరిసారిగా 1907లో కనిపించినట్లు నిర్ధారణ అయ్యింది.

Tags

Next Story