Happiest Country : ప్రపంచంలోనే హ్యాపీ కంట్రీ ఏదో తెలుసా? వరుసగా 8వ సారి ఫస్ట్ ప్లేస్

Happiest Country : ప్రపంచంలోనే హ్యాపీ కంట్రీ ఏదో తెలుసా? వరుసగా 8వ సారి ఫస్ట్ ప్లేస్
X

సంతోషానికి కేరాఫ్ ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఎనిమిదోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ సంతోషకర దేశాల జాబితాను విడుదల చేసింది. సంపద, వృద్ధి, మానవ సంబంధాలు, మనుషుల మధ్య విశ్వాసం, ఆత్మసంతృప్తి, సామాజిక మద్దతు, జీవితకాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను ప్రామాణికం గా తీసుకుని ఈ సర్వే చేపట్టింది. దాని ఫలితాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఇందులో మరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడెన్ ఉన్నాయి.

147 దేశాల లిస్టులో భారత్ 118వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ 126వ స్థానంలో నిలవగా, ఈసారి 8 ర్యాంకులు మెరుగై 118వ ప్లేస్ కు చేరుకుంది. తీవ్ర అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. కోస్టారికా 6, ఇజ్రాయెల్ 8, మెక్సికో 10 స్థానాలతో టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వరుసగా 24, 23, 33వ స్థానాల్లో నిలిచాయి. 2012లో 11వ స్థానంలో నిలిచిన అమెరికా ఇప్పుడు 24వ స్థానానికి పడిపోవడం గమనార్హం. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఒంటరిగా భోజనం చేసే వారిసంఖ్య 53 శాతం పెరిగిందని ఈ నివేదిక తెలిపింది.

Tags

Next Story