Weather : దుబాయ్‌లో దంచికొడుతున్న వానలు

Weather : దుబాయ్‌లో దంచికొడుతున్న వానలు
X

ఎడారి దేశం దుబాయ్ లో వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారీ వరదలకు జనజీవనం స్థంభించిపోయింది. దుబాయ్ లో అయితే రహదారులపై నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.

అరబ్ ఎమిరేట్స్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో.. ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపేశారు. దుబాయ్ లో వానలు, వరదలతో.. ప్రపంచ యానం కూడా స్తంభించిపోయింది. పలు విమానాలు రద్దు కావడం, పలు విమానాలు దారి మళ్లించడం చేస్తున్నారు అధికారులు.

బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా దుబాయ్ లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఒమన్ లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకూ పద్దెనిమిది మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story