Nepal-China Border : నేపాల్-చైనా సరిహద్దులో వరదలు

Nepal-China Border : నేపాల్-చైనా సరిహద్దులో వరదలు
X

నేపాల్, చైనా సరిహద్దుల్లో వరదలు సం భవించాయి. భారీ వర్షాలకు బోటెకోషి నది ఉప్పొంగింది. వరద తాకిడికి మిటేరి వంతెన కొట్టుకుపోయింది. దీంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకు పోయాయని అధికారులు తెలిపారు. వరదల సమయంలో అక్కడ 200 వాహనాలు ఉన్నట్లు సమాచారం. నేపాల్ ప్రాంతంలో అనేకమంది వ్యాపారులు, నేపాల్కు చెందిన 12 మంది పోలీసులు వరదల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. స్థానిక అధికారులు నేపాల్ ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇవాళ తెల్లవా రుజామున వరద ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ముంచెత్తడంతో పలు నివాసాలు నీట ముని గినట్లు అధికారులు పేర్కొన్నారు. వరదలో ఎంతమంది కొట్టుకుపోయారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. డ్రైపోర్టులోని పలు వాహనాలలో నిద్రిస్తున్న కొంతమంది వాహనాలతో పాటు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.

Tags

Next Story