Trump : మరెవరినో గెలిపించేందుకే భారత్ కు ఫండింగ్.. ట్రంప్ సంచలనం

Trump : మరెవరినో గెలిపించేందుకే భారత్ కు ఫండింగ్.. ట్రంప్ సంచలనం
X

భారత్ లో ఓటింగ్ పెంచేందుకు అమెరికా సాయంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ పెంపునకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్ న డోజ్ విభాగం రద్దు చేయడాన్ని సమర్థించారు. భారత్ లో ఎవరినో గెలిపించడానికి ఇలా చేశారని గత బైడెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు వారు ప్రయత్నించారని పరోక్షంగా ఆరోపించారు. మియామీలోని ఓ సదస్సులో పాల్గొట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'భారత్లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలి? బహుశా ఆ దేశంలో మరెవర్నో గెలిపించేందుకు వారు ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. అదే కీలక ముందడుగు అవుతుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Tags

Next Story