Israel : ఇజ్రాయెల్ యుద్ధం.. గాజాకు పోలియో ముప్పు
ఇజ్రాయెల్ యుద్ధంతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైంది. అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. స్థానిక మురుగునీటి నమూనాల్లో పోలియో కారక వైరస్ అవశేషాలు గుర్తించారు. దీంతో వ్యాధి నిరోధక చర్యలకు ఉపక్రమించిన డబ్ల్యూహెచ్ఓ అక్కడి చిన్నారులకు 10లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
ఇప్పటివరకు ఇక్కడ పోలియో కేసు నమోదు కాలేదు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధి బారినపడేందుకు మరెంతో సమయం లేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ చెప్పారు. యుద్ధం కారణంగా గడిచిన తొమ్మిది నెలలుగా వ్యాక్సిన్ పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నా యని.. దీంతో ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి ముప్పు అధికంగా ఉందన్నారు.
రెండేళ్లలోపు శిశువులకు మరింత ప్రమాదకరంగా మారిందన్నారు అథనోమ్. గాజాలో నెలకొన్న పరిస్థితులతో అక్కడి చిన్నారులకు పోలియో ముప్పుతోపాటు హెపటైటిస్ ఏ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఐరాస ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com