Gold Prices : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Gold Prices : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
X

గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.72,380గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.66,350కి చేరింది. అటు కేజీ వెండి ధర కూడా రూ.2,000 దిగి రూ.92,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,530.

ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,350 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,380.

చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,950 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,040.

అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు తగ్గాయి. శనివారం ఔన్స్ గోల్డ్​ ధర 2328గా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.69 డాలర్లుగా ఉంది. పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Tags

Next Story