Greece : స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన గ్రీస్

స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంట్ ఫిబ్రవరి 15న ఆమోదించింది. ఎల్‌జిబిటి హక్కుల మద్దతుదారులకు ఇది పెద్ద విజయం. పార్లమెంటు ఆమోదంతో చాలా మంది ఏథెన్స్ వీధుల్లో హర్షధ్వానాలు చేశారు. ఈ చట్టం స్వలింగ జంటలకు వివాహం చేసుకోవడానికి, పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఇస్తుంది. సామాజికంగా సంప్రదాయవాద దేశంలో వివాహ సమానత్వం కోసం LGBT సంఘం దశాబ్దాలుగా ప్రచారం చేస్తోంది.
ఈ తరహా యూనియన్లను అనుమతించిన మొదటి ఆర్థడాక్స్ క్రైస్తవ దేశాలలో గ్రీస్ ఒకటి. "ఇది చారిత్రాత్మక క్షణం" అని స్వలింగ తల్లిదండ్రుల గ్రూప్ రెయిన్‌బో ఫ్యామిలీస్ హెడ్ స్టెల్లా బెలియా రాయిటర్స్‌తో అన్నారు. "ఇది సంతోషకరమైన రోజు" అని అభివర్ణించారు, ఈ బిల్లును 300 సీట్ల పార్లమెంటులో 176 మంది చట్టసభ సభ్యులు ఆమోదించారు. అది అధికారిక ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించిన తర్వాత చట్టంగా మారుతుంది.
పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు తీవ్రవాద పార్టీలలో ఒకటైన ఎల్లినికి లైసీ, ఈ బిల్లును "క్రైస్తవ వ్యతిరేకం" అని పిలిచారు. ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అన్నారు. "ఖచ్చితంగా నేను దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తాను. స్వలింగ జంటల వివాహం... మానవ హక్కు కాదు" అని న్యూ డెమోక్రసీ చట్టసభ సభ్యుడు, మాజీ ప్రధాని ఆంటోనిస్ సమరస్ (Antonis Samaras) అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com