Donald Trump : అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డ్: ట్రంప్

అమెరికా ఫస్ట్ అంటూ వలసదారులపై విమర్శలతో విరుచుకుపడే డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ఈసారి రూటు మార్చారు. అధ్యక్షుడిగా గెలిస్తే ఆమెరికా లోని విదేశీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే గ్రీన్ కార్డూ లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు. భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు తిరిగి వెళ్లిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
స్వదేశాలకు వెళ్లి వారు వేల మందికి ఉపాధి కల్పించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు.అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారు.
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విదేశీయుల సంఖ్య ప్రతి యేటా విపరీతంగా పెరిగిపోతోంది. యూఎస్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మందికి నిరాశ ఎదురవుతోంది. ఈ వ్యవహారం.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కేంద్రబిందువుగా మారింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com