Hamas-Israel : హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు .. 35 మంది మృతి

హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రఫాపై నిన్న ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 35 మంది మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొన్నారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు రఫాపై చేసిన దాడిలో హమాస్ గ్రూప్ అధికారులు యాసిన్ రబియా, ఖలీద్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.
అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్ దీర్ఘ శ్రేణి రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. టెల్ అవీన్లో సైరన్లు మోగడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి అని చివరగా జనవరిలో హమాస్ రాకెట్లు ప్రయోగించిదని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే తమ పౌరులపై జరుగుతున్న మారణకాండకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు హమాస్ తెలిపింది.
గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు జరిపినట్లు హమాస్ పేర్కొంది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. ఈ దాడులకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినట్లు ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com