Saudi Arabia : సౌదీలో వడగాలులకు వెయ్యిమందికి పైగా మృతి

సౌదీ అరేబియాలో ( Saudi Arabia ) రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం క్రితం అత్యధికంగా 51.8 డిగ్రీలు నమోదైనట్లు అక్కడి వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హజ్ యాత్రకు ( Hajj Pilgrims ) వెళ్లిన వారిలో వడదెబ్బ కారణంగా వంద లాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఖ్య 1000 దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు ఈజిప్టు దేశస్థులే కాగా.. భారత్, పాకిస్థాన్, జోర్డాన్, ఇండోనే షియా, ఇరాన్, సెనెగల్, ట్యూనిషియాకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మృతి చెందినవారిలో అత్యధికంగా ఈజిప్టు వాసులే ఉన్నట్లు అరబ్ రాయబారి వెల్లడించారు. గురువారం ఒక్కరోజే ఆ దేశానికి చెందిన 58 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 658కి చేరింది. వీరిలో 630 మంది అనుమతి లేని యాత్రి కులే ఉన్నట్లు సమాచారం.
మొత్తంగా 10 దేశాలకు చెందిన 1081 మంది యాత్రి కులు ఎండ దెబ్బకు మరణించినట్లు తెలిసింది. కార్యాలయాల ప్రకటనల ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు సమాచారం. మెడికల్ కాంప్లెక్స్ వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు. అయిదు రోజుల హజ్ యాత్రలో భాగంగా ఈ ఏడాది మొత్తం 18.3 లక్షల మంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షలమంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షలకు పైగా ఉంటారని సౌదీ హజ్ అధికార యంత్రాంగం తెలిపింది. యాత్ర అనుమతి కోసం భారీగా ఖర్చు అవుతుండటంతో చాలామంది అక్రమ మార్గాల్లో మక్కాకు చేరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com