Flights Cancel : భారీ వర్షాలు .. హైదరాబాద్ – దుబాయ్ ప్లైట్స్ క్యాన్సిల్

దుబాయ్‌లో వరదల బీభత్సం సృష్టిస్తుండడంతో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు గురువారం రద్దయ్యాయి. జీఎంఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన నాలుగు విమానాలు గురువారం రద్దయ్యాయి. భారీ వర్షాల వల్ల దుబాయ్ విమానాశ్రయంలోకి వరద నీరు పోటెత్తడంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయని పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా విమానం కూడా రద్దయిందని తెలిపారు. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గుర్తింపు ఉంది. అలాంటి దుబాయ్ లో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది. భారీగా వరదలు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్ నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్ లో మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 1949 తరువాత దుబాయ్ లో ఇదే అత్యధిక వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com