Ukraine : యుక్రెయిన్‌కు జీ-7 దేశాల రూ.లక్షల కోట్ల సాయం

Ukraine : యుక్రెయిన్‌కు జీ-7 దేశాల రూ.లక్షల కోట్ల సాయం
X

యుక్రెయిన్‌కు ( Ukraine ) జీ7 దేశాలు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. రూ.4.1. 7 లక్షల కోట్ల రుణ ప్యాకేజీ అందించాలని ముందుకొచ్చాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి.

ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆంక్షల కారణంగా పలుదేశాల్లో దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన రష్యా ఆస్తులను

స్తంభింపజేసింది. తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే అందనున్నాయి.

ఉక్రెయిన్ కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తాజాగా ప్రకటించారు. మరో పక్క యుక్రెయిన్ పై దాడి చేసినందుకు మాస్కో పరిహారం చెల్లించే వరకు, రష్యా ఆస్తులపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా, యురోపియన్ యూనియన్ ప్రకటించాయి.

Tags

Next Story