Netanyahu : నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్!

Netanyahu : నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్!

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ అంతర్జాతీయ నేర న్యాయ స్థానానికి అభ్యర్థన దాఖలు కావడం సంచలనం రేపుతోంది. దీని వెనక ఒక హీరో సతీమణి కీలకపాత్ర పోషించారు. ఆమె అందించిన సహకారం ఆధారంగానే ప్రధాన ప్రాసిక్యూటర్ పిటిషన్ వేశారు. ఆయనకు సహకరించిన నిపుణుల బృందంలో ఆమె కూడా ఒకరు. అమెరికాకు చెందిన నటుడు, ఫిల్మ్ మేకర్ జార్జ్ క్లూనీ సతీమణి పేరు అమల్ క్లనీ. ఆమె బ్రిటిష్- లెబనీస్ సంతతికి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది.

అరెస్ట్ వారెంట్ కోసం ఐసీసీకి అభ్యర్ధన వచ్చిన సమయంలో క్లునీ ఫౌండేషన్ ఫర్ జస్టిస్ వెబ్ సైట్ లో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్, గాజాలో అను మానిత యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరాలకు సంబంధించిన సాక్ష్యాల వివరాలు అందులో తెలిపింది. బందీలను తీసుకెళ్లడం, హత్య చేయడం, లైంగికంగా వేధించడంలో హమాస్ నేతలు బిజీగా ఉన్నారని తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధానిపైనా విమర్శలు గుప్పించారు. నెతన్యాహు యుద్ధ నేరాలపై ఐసీసీ విచారణకు మద్దతుగా అంతర్జాతీయ మీడియాకు ఒక ఆర్టికల్ ను రాసింది.

పౌరుల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె తెలిపింది. యుద్ధ సమయాల్లో పౌరుల్ని రక్షించేందుకు 100 సంవత్స రాల క్రితమే చట్టం ఉందనీ.. ఈ చట్టం అన్ని దేశాలకు వర్తించాలని కోరింది.

Tags

Next Story