Bhutan : భూటాన్‌కు సాయంగా రూ.2 వేల కోట్లు.. మాల్దీవులకు కోత

Bhutan : భూటాన్‌కు సాయంగా రూ.2 వేల కోట్లు.. మాల్దీవులకు కోత

పొరుగున ఉన్న భూటాన్ తో బంధాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా వారికి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. అదే మాల్దీవులకు కేటాయించే ఆర్థిక సాయంలో మాత్రం కోత విధించారు. తాజా బడ్జెట్ లో భూటాన్ తో పాటు మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, అఫ్ఘాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు.

నేపాల్ కు రూ.700 కోట్లు, శ్రీలంకుకు రూ.245 కోట్లు. ఆఫ్ఘానిస్తాన్ కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్ కు రూ.120 కోట్లు, మయన్మార్ కు రూ.250 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా, ఇరాన్ తో అనుసంధాన ప్రాజెక్టులపై దృష్టిపెట్టిన కేంద్రం.. చాబహర్ పోర్టు నిర్వహణకు తాజా బడ్జెట్లో రూ.100 కోట్లు ప్రకటించింది.

మొత్తమ్మీద విదేశీ వ్యవహారాల శాఖకు రూ.22,154 కోట్లు బడ్జెట్ కేటాయించారు. దీనిలో నుంచి భూటాన్ కు అత్యధికంగా రూ.2 వేల కోట్లను కేటాయించారు. మాల్దీవులకు గత బడ్జెట్ కన్నా తక్కువగా రూ.400 కోట్లకు పరిమితం చేశారు. మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించగా.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుత కేటాయింపులను బట్టి తెలుస్తోంది.

Tags

Next Story