India–Iran : ఇరాన్ తో చర్చలు సఫలం.. గ్యాస్ కష్టాలు తీరుతాయా..?

India–Iran : ఇరాన్ తో చర్చలు సఫలం.. గ్యాస్ కష్టాలు తీరుతాయా..?
X

మొత్తానికి ఇరాన్ తో ఇండియా చర్చలు సఫలం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. భారత నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇస్తోంది. దీంతో నేడు రెండు నౌకలు హర్మూజ్ నుంచి ఇండియాకు చేరుకున్నాయి. అటు హర్మూజ్ జలసంధిలో ఇంకా 27 నౌకలు ఇండియా జెండాలతో ఉన్నాయని.. అవన్నీ సురక్షితంగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. కానీ ఈ దిగుమతులు ఎంత వరకు అంటే చెప్పలేని పరిస్థితి. గల్ఫ్‌ దేశాల్లో ఇంతకు ముందు ఉన్నంత స్థాయిలో క్రూడ్ ఆయిల్ ఎగుమతులు జరగట్లేదు. ఆయిల్ రిఫైనరీ సెంటర్లు మొత్తం ఇరాన్ ధ్వంసం చేసింది. కాబట్టి వాటిని ఇప్పట్లో పునరుద్ధరించే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఇండియాలో ప్రస్తుతం గ్యాస్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి.

కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ కష్టాలు ఆగట్లేదు. హాస్టళ్లు, హోటళ్లు మూత పడే పరిస్థితికి వచ్చాయి. రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్లు తగ్గించేశారు. గ్యాస్ మీద ఆధారపడిన అన్ని రంగాలు సంక్షోభంలో పడ్డాయి. గ్యాస్ ధరలు బ్లాక్ లో అమ్ముకునేందుకు అటు ఏజెన్సీలు కుట్రలు చేస్తున్నాయి. ఇలా బ్లాక్ లో అమ్ముకునే వారిపై అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మన నౌకలను పర్మిషన్ ఇవ్వడం చాలా పెద్ద ఊరట.

కానీ అది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఎందకంటే ఇరాన్ పర్మిషన్ ఇస్తున్నా.. యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆశించిన స్థాయిలో ఎగుమతులు జరిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాల నుంచి ఆశించిన స్థాయిలో ఎగుమతులు జరిగే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఇరాన్ ఇండియాకు క్రూడ్ ఆయిల్ ఎగుమతులు పెంచితే అది ఇండియాకు పెద్ద లాభమే అవుతుంది.

Tags

Next Story