Canada : అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్

Canada : అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్
X

కెనడాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. హామిల్టన్‌లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా ఒంటారియోలోని ఓ బస్టాప్ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులు జరిపాడు. కానీ ఓ బుల్లెట్ మిస్సై హర్‌సిమ్రత్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఘటన అనంతరం ఆ రెండు వాహనాలు అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హర్‌సిమ్రత్‌ మృతిపై భారత కాన్సులేట్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కాల్పుల ఘటనలో ఓ అమాయకురాలు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని పేర్కొంది. మృతురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

Tags

Next Story