Israel : రఫాలో విధ్వంసానికి ఇజ్రాయెల్ సిద్ధం.. యూఎన్ఓ ఆందోళన

పాలస్తీనాలోని ప్రాంతాల మీద ఇజ్రాయెల్ దాడులపై యూఎన్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. కాల్పుల విరమణపై ఒప్పందంతో సంబంధం లేకుండా రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. దీంతో.. ఈ నిర్ణయంపై యూఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
గాజాలోని రఫా ప్రాంతంపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇది తీవ్ర విషాదానికి దారితీసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించింది. రఫాపై దాడిని దానితో సమర్థించుకోవద్దని సూచించింది.
ప్రపంచ దేశాలు కలగజేసుకుని ఈ యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేయాలని యూఎన్ఓ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కోరారు. దాదాపు 12 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకున్నారని తెలిపారు. రఫాలో భూతల దాడులు జరిగితే చెప్పలేని విషాదాన్ని మిగిలిస్తుందని అన్నారు. ఇజ్రాయెల్‌తో సన్నిహితంగా ఉంటున్న దేశాలు తమవంతు ప్రయత్నాలు చేయాలని యూఎన్ఓ కోరింది. భారత్ మరోసారి ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com