Iran-Israel : ఇరాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

Iran-Israel : ఇరాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జిహలేవి కీలక ప్రకటన చేశారు. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినందుకు ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన వెల్లడించారు.

''మా దేశం వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్​ భావించింది. గతంలో ఎన్నడూ ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు'' అని ఎల్జీ చెప్పారు. ''ఒకవేళ మేం ఇప్పుడు స్పందించకుండా వదిలేస్తే.. భవిష్యత్తులో ఇరాన్‌ నుంచి మరింత ముప్పు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది'' అని హెర్జిహలేవి తెలిపారు.

ఇరాన్‌ విషయం తేలే దాకా గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ప్రతిదాడి చేయాలా ? వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇజ్రాయెల్‌కు ఉందని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమపై ప్రతిదాడికి ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌పై ఎటాక్ చేస్తామనే ఇన్ఫర్మేషన్‌ను తాము అమెరికాకు 72 గంటలకు ముందే అందించామని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హసేన్‌ అమీర్‌ అబ్దుల్ల్లా హియాన్‌ వెల్లడించారు. ఇరాన్‌ను రక్షించుకునేందుకు ఈ దాడి చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story