Israel : గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. 24 గంటల్లో 53 మంది మృతి..

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. IDF దాడుల్లో 24 గంటల్లోనే 53 మంది మృత్యువాతపడ్డారు. మరో 357 మంది తీవ్రంగా గాయపడ్డట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారిలో పారా మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. టాల్ అస్-సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడి బాధితులకు సాయం అందించేందుకు వీరు వెళ్లగా గాయపడ్డారు. కాగా గాజా ప్రాంతం మొత్తం తమ అధీనంలోకి వచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
గాజాలో హత్యకు గురైన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ ప్రాంతంలో 13,000 మందికి పైగా అదృశ్యమయ్యారని ఒక అంచనా. వీరిలో చాలామంది చనిపోయి, శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ యుద్ధ క్యాబినెట్ మంత్రి బెన్నీ గాంట్జ్ పార్లమెంటును రద్దు చేయడానికి పార్లమెంటరీ ఓటును నిర్వహించాలని ప్రతిపాదించారు. గాజా యుద్ధానికి సంబంధించి జూన్ 8 నాటికి ఎటువంటి ప్రణాళిక లేకపోతే సంకీర్ణం నుండి వైదొలుగుతానని అంతకుముందు గాంట్జ్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com