American Battle : అమెరికా బ్యాటిల్.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బెడైన్

అమెరికా అధ్యక్ష రేసులో మరోసారి నిలిచారు ఆ దేశాధ్యక్షుడు జో బెడైన్. ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరపున ఆయన నామినేషన్ ఖరారు అయ్యింది. తుది పోరులో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తోనే అధ్యక్ష రేసులో పోటీపడే ఛాన్సు ఉందని తెలుస్తోంది. అమెరికాలోని గడిచిన 70 ఏళ్ల చరిత్రలో ఇద్దరు అభ్యర్థులు రెండోసారి మళ్లీ పోటీపడే అవకాశాలు ఉన్నాయి.
డెమోక్రటిక్ పార్టీ తరపున బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు 1968 డెలిగేట్లను నెగ్గాల్సి ఉంటుంది. నామినేషన్‌కు కావాల్సిన సంఖ్యా బలాన్ని ఆయన దాటినట్టు తెలుస్తోంది. జార్జియా రాష్ట్రానికి చెందిన ప్రైమరీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో బైడెన్ కు రూట్ క్లియర్ అయ్యింది. మిస్సిసిపీ, వాషింగ్టన్ స్టేట్, నార్తర్న్ మారియానా ఐలాండ్స్ ఫలితాలు రావాల్సి ఉన్నది.
డొనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ తరపున దాదాపు తన నామినేషన్ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. జార్జియా ఫలితాలు పూర్తిగా వస్తే దీనిపై క్లారిటీ రానుంది. అధ్యక్ష రేసు నుంచి నిక్కీ హేలీ కూడా తప్పుకోవడంతో ట్రంప్ కు లైన్ క్లియర్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com