Joe Biden : జో బైడెన్ టంగ్ స్లిప్.. ట్రంప్‌కు మరో ఆయుధం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆయన మతిమరుపు సమస్యను మీడియా ముందు బయటపెట్టుకున్నారు. అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు ట్రంప్... ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్.. ఇలా.. తన మాటలతో పొరపాటుగా మాట్లాడి మరోసారి విమర్శల పాలయ్యారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. జెలెన్ స్కీ, కమలా హ్యారిస్ పేర్లు చెప్పడంలో తడబాటుకు బైడెన్ గురికావడం చర్చనీయాంశమైంది.
తాజాగా వాషింగ్టన్లో జరిగిన నాటో కూటమి సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పరిచయం చేసే క్రమంలోను 81 ఏళ్ల బైడెన్ తడబడ్డారు. గొప్ప సంకల్పం, ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తిగా కొనియాడుతూ ఆయనను ప్రసంగించమని కోరారు. ఆ సమయంలో జెలెన్ స్కీని ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు. సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. జెలెన్ స్కీ మాత్రం నవ్వుతూ దాన్ని తేలిగ్గా తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com