Nepal New PM : నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ

Nepal New PM : నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ
X

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలిని ( KP Sharma Oli ) నియమించినట్లు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. ఓలితోపాటు కొత్త మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది. దీంతో 77 సీట్లున్న కేపీ శర్మ(CPN-UML), 88 సీట్లున్న బహదూర్(NC) కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తొలి 18 నెలలు ఓలి, ఆ తర్వాత బహదూర్‌గా ప్రధానిగా కొనసాగుతారు. ఓలితోపాటు ఆయన మంత్రివర్గం సోమవారం ప్రమాణం చేయనుంది. గతంలో నేపాల్‌ ప్రధానిగా కేపీ శర్మ ఓలి 2015–16, 2018–2021 సంవత్సరాల మధ్యలో పనిచేశారు. అయితే, అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13వ తేదీన మరోసారి ఓలిని రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ప్రధానిగా నియమించడం వివాదమైంది. ఈ నియమాకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో ఐదు పార్టీలు చేరే అవకాశాలున్నాయంటున్నారు.

Tags

Next Story