Snap Elections : ఫ్రాన్స్ పార్లమెంటు రద్దు చేసిన మేక్రాన్.. ముందస్తుకు రెడీ!

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్యనిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ను రద్దు చేస్తూ స్నాప్ ఎలక్షన్స్ కు పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఐరోపా యూనియన్ ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి సానుకూలత వ్యక్తమైన తరుణంలో మేక్రాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. గడువు ప్రకారం కాకుండా ముందుగానే రద్దు చేస్తే స్నాప్ ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ముందస్తు ప్రకటనలు లేకుండానే, పూర్తిస్థాయి పదవీకాలం ముగియకముందే వీటిని నిర్వహించే వీలు ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా పలు అధికార పార్టీలు తమ వ్యూహాల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు నుంచి లబ్ధి పొందేందుకు, ఏదైనా ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు దాని పరిష్కారం కోసం ఈ దిశగా అడుగులు వేస్తుంటాయి. మనదేశంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటివి చూస్తుంటాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com