PM Modi : మోడీ రాక ముందు ఇటలీలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
ఖలిస్థానీ ఉగ్రవాదులు ఇటలీలో మోడీ పర్యటనకు ముందు దుశ్చర్యకు పాల్పడ్డారు. మహాత్మ గాంధీ విగ్రహాన్ని బుధవారం ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ప్రారంభించిన కొద్ది గంటల్లోనే దీన్ని ధ్వంసం చేశారు. విగ్రహం ఉంచిన బేస్ పై ఖలిస్థానీ టెర్రరిస్టు హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్యపై స్లోగన్స్ కూడా రాశారు.
విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi ) ఇటలీలో జరగనున్న జీ7 దేశాల సమ్మిట్ కు హాజరు కానున్నారు. దీనికి ఒక రోజు ముందు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 50వ జీ 7 దేశాల సమ్మిట్ జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గోఎగ్నాజియా రిసార్ట్లో జరగనుంది.
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఆహ్వనం మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటలీకి వెళ్లనున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ తన ఆందోళలనను ఇటలీ అధికారులకు -తెలియజేసిందని ఆయన చెప్పారు. దీనికి బాధ్యులపై కఠిన చర్యలు -తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com