Russia ; గడిచిన 25ఏళ్లలో మాస్కో జరిగిన భారీ దాడులు

Russia ; గడిచిన 25ఏళ్లలో మాస్కో జరిగిన భారీ దాడులు

రష్యా రాజధాని మాస్కోలోని రాక్ కాన్సర్ట్ మాల్‌లో మార్చి 22న జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 70మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. కొందరు ముష్కరులు ఈ మాల్‌లో కాల్పులు జరిపినట్టు తెలుస్తుండగా.. రష్యా ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. రష్యా మానవ హక్కుల కమిషన్‌తో పాటు పలు దేశాలు కూడా ఈ దాడిని ఖండించాయి. అయితే ఇలాంటి దాడితో రష్యా వణికిపోవడం ఇదే తొలిసారి కాదు. రష్యాలోని మాస్కో గత 25 ఏళ్లలో ఇలాంటి అనేక దాడులను ఎదుర్కొంది. ఇందులో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత 25 సంవత్సరాలలో మాస్కోలో జరిగిన కొన్ని దారుణమైన దాడుల గురించి తెలుసుకుందాం.

అపార్ట్మెంట్ భవనం బాంబు దాడి 1999

జనవరి 13, 1999 తెల్లవారుజామున, ఆగ్నేయ మాస్కోలోని ఎనిమిది అంతస్తుల అపార్ట్మెంట్ భవనంలో బాంబు పేలింది. ఇందులో 118 మంది చనిపోయారు. మాస్కో, దక్షిణ రష్యాలో రెండు వారాల్లో మొత్తం 293 మందిని చంపిన అపార్ట్‌మెంట్ భవనాలపై జరిగిన ఐదు దాడులలో ఈ దాడి ఒకటి.

థియేటర్ బందీ సంక్షోభం 2002

అక్టోబరు 23, 2002న, 21 మంది పురుషులు,19 మంది మహిళా చెచెన్ తిరుగుబాటుదారుల బృందం ఒక సంగీత కచేరీ సందర్భంగా మాస్కోలోని డుబ్రోవ్కా థియేటర్‌పై దాడి చేసింది.

రాక్ కచేరీ దాడి 2003

జూలై 5, 2003న, మాస్కో సమీపంలోని తుషినో ఎయిర్‌ఫీల్డ్‌లో రాక్ సంగీత కచేరీ సందర్భంగా ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు.

2004,2010లో మెట్రో బాంబు దాడులు

ఫిబ్రవరి 6,2004న, ఒక చెచెన్ బృందం తెల్లవారుజామున నిండిపోయిన మాస్కో మెట్రోలో బాంబును పేల్చింది. 41మంది మరణించారు. మార్చి 29, 2010న, మాస్కో మెట్రోలో మరో ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడుల్లో 40 మంది చనిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story