India-Maldives : భారత్ ఎప్పటికీ మిత్ర దేశమే : మహ్మద్ ముయిజ్జు
భారత్ ఎప్పటికీ తమకు మిత్రదేశమేనని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తెలిపారు. మాల్దీవులకు అవసరమైనప్పుడల్లా సాయాన్ని అందిస్తుందని అన్నారు. మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ అనేక అంశాలపై చర్చలు జరిపారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆగస్టు 11వరకు అక్కడే ఉండనున్న ఆయన.. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి సంబంధించి ‘ఎక్స్’లో జైశంకర్ పోస్ట్ చేశారు. ముయిజ్జుతో భేటీ కావడం విశేషమన్న ఆయన.. ప్రధాని మోదీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసినట్లు వివరించారు. తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్-– మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com