Maldives : భారత పతాకాన్ని అవమానిస్తూ మాల్దీవుల మంత్రి పోస్ట్

Maldives : భారత పతాకాన్ని అవమానిస్తూ మాల్దీవుల మంత్రి పోస్ట్

సస్పెండ్ చేయబడిన మాల్దీవుల మంత్రి మరియమ్ షియునా భారత జాతీయ జెండాను (Indian Flag) అగౌరవపరిచే విధంగా ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేయడం ఆగ్రహాన్ని రేకెత్తించడంతో క్షమాపణలు చెప్పారు. ఈ తొలగించబడిన పోస్ట్, ద్వీప దేశంలో పార్లమెంటు ఎన్నికలకు ముందు, త్రివర్ణ పతాకంపై అశోక్ చక్రతో పార్టీ చిహ్నం స్థానంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ప్రచార పోస్టర్‌ను చూపింది.

భారత వ్యతిరేక, చైనా అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ భారత వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నారు. ఒకవైపు మాల్దీవుల్లో పరిస్థితులు దిగజారిపోతున్నా తన పంతం మాత్రం వీడటం లేదు. అయితే దౌత్య పరమైన వివాదం ఉన్నప్పటికీ.. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి మాల్దీవులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. దీనికి మాల్దీవులు ధన్యవాదాలు కూడా తెలిపింది. అది జరిగి రెండు రోజులు కూడా కాకముందే ఆ దేశ మాజీ మంత్రి మరియం షియునా మరో వివాదానికి తెరతీశారు.

సస్పెండ్ అయిన మాల్దీవుల మంత్రి మరియం షియునా భారత జాతీయ జెండాను అగౌరవపరిచే విధంగా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో మరియం షియునా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. వెంటనే ఆ పోస్ట్‌ను కూడా డిలీట్ చేశారు. మాల్దీవుల్లో మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు భారత త్రివర్ణ పతాకంపై అశోక చక్రం స్థానంలో ప్రతిపక్ష పార్టీ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను ఉంచి మరియం షియునా సోషల్ మీడియా పోస్ట్ చేశారు. మాల్దీవుల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ పార్టీ సభ్యురాలైన మరియం షియునా.. ఆ ఫోటోను పోస్ట్ చేసి పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇదే ఇప్పుడు భారత్ మాల్దీవుల మధ్య మరో వివాదానికి కేంద్ర బిందువు అయింది.

Tags

Read MoreRead Less
Next Story