MISS USA : మిస్ యుఎస్ఎ హోదాకు విజేత నోయెలియా రాజీనామా

గత యేడాది మిస్ అమెరికా పోటీల్లో విజేతగా నిలిచిన నోయెలియా వోయిజ్ తాను టైటిల్ విజేత హోదాకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. తన మానసిక స్థితి కారణంగానే ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించింది. మిస్ యుఎస్ఎ 2023 టైటిలు గత ఏడాది ఏప్రిల్లో ఆమె గెలుచుకుంది.
ఆమె మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. అందువల్లనే ఆమె తన ఇన్ స్టా పోస్టులో ఈనిర్ణయం ప్రకటించింది. మిస్ యూఎస్ఏ పోటీల నిర్వాహకులు కూడా
అధికారికంగా ఆమె వైదొలగాలన్న నిర్ణయాన్ని ధృవీకరించారు. జీవితంలో కొన్ని నిర్ణయాలు కీలకంగా ఉంటాయని, మానసిక ఆరోగ్యపరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు కీలక నిర్ణయాలు కొన్ని అవసరం అవుతాయని, వ్యక్తులుగా విభిన్న అంశాలపై మనకు విశేషానుభవాలు ఎదురవుతాయని ఆమె తెలిపింది.
మిస్ యూఎస్ఏగా తన ప్రయాణం అర్ధవంతమైనదని, ఉటాఫ్ తరపున ప్రాతినిధ్యం వహించిన తాను తర్వాత మిస్ యూనివర్స్ గా ఎదిగినట్టు తెలిపింది. తనపట్ల ఎంతో అభిమానం చూపించిన ఫ్యాన్స్ కు, కుటుంబసభ్యులు, స్నేహితులు, ఎంతో రుణపడి ఉంటానని నోయెలియా తన ఇన్ స్టా పోస్టులో వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com