Interim President of Iran : ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా మహ్మద్ మెఖ్బర్

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడుగా మహ్మద్ మెఖ్బర్ నియమితులయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖొమైనా మొఖ్బర్ నియామకానికి ఆమోదముద్ర వేసారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఎన్నిక నిర్ణయం తీసుకున్నారు.
కొన్నేళ్లుగా ఉపాధ్యక్షుడిగా ఉంటున్న మెఖ్బర్ ను తాత్కాలిక దేశ అధ్యక్షుడుగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో ఆలీఖామైనీ ఈ సందేశం వెల్లడించారు. అలాగే దేశంలో ఐదురోజులు సంతాపదినాలు ప్రకటించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఇరాన్ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్ ఖొమైనీ ఆమోదముద్ర అవసరం. అనంతరం మొదటి వైస్ ప్రెసిడెంట్ పార్లమెంటు స్పీకర్ న్యాయవిభాగాధి పతితో కూడిన ఓ కౌన్సిల్ ను ఏర్పాటుచేస్తారు. ఈ క్రమంలోనే 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడికోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com